2028 ఒలింపిక్స్ నుంచి మీరాబాయి కేటగిరి తొలగింపు
న్యూఢిల్లీ: భారత స్టార్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ప్రస్తుతం పోటీపడుతున్న 49 కిలోల బరువు విభాగాన్ని వచ్చే 2027 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి తొలగించారు. విశ్వక్రీడల మహిళల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లను 12 (పురుషులు 6, మహిళలు 6)కు పెంచడంలో భాగంగా ఇప్పటిదాకా ఉన్న అతి తక్కువ వెయిట్ కేటగిరిని 49 నుంచి 53 కిలోలకు ఐఓసీ మార్చినట్టు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) తెలిపింది. వాస్తవానికి మీరాబాయి.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 49 కిలోల విభాగంలోనే రజతం సాధించింది. ఐఓసీ తాజా నిర్ణయంతో రానున్న ఒలింపిక్స్‌లో మీరా 53 కిలోల విభాగం నుంచి బరిలోకి దిగే అవకాశముంది. అయితే వచ్చే ఏడాది ఆసియా క్రీడల వరకు మీరా, తన పాత కేటగిరి 49 కిలోల్లోనే పోటీపడుతుంది. తాజా ఐఓసీ నిర్ణయం ప్రకారం వచ్చే ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల విభాగం నుంచి 53, 61, 69, 77, 86, 86+ కిలోలు, పురుషుల తరఫున 65, 75, 85, 95, 110, 110+ కిలోల విభాగాల్లో లిఫ్టర్లు పోటీపడాల్సి ఉంటుంది.








Comments