అమల్లోకి భారత్-ఒమన్ స్వేచ్ఛా వాణిజ్యం
న్యూఢిల్లీ : భారత్-ఒమన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) మన దేశ ఎగుమతి దారులకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అవాంతరాలతో ఇంధనం, గ్యాస్ సహా పలు ఉత్పత్తుల రవాణాకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్-ఒమన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ‘మస్కట్ తీరం’ భారత్‌కు అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా హోర్ముజ్‌కు ఆవల.. ఇబ్బందులు లేకుండా అరేబియా గుండా సరుకు రవాణాకు అవకాశం ఏర్పడింది.










Comments