ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు
పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.










Comments