ఏపీసెట్-2025 ఫలితాలు విడుదల
విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీసెట్) ఫలితాలను బుధవారం ఉపకులపతి, సెట్ చైర్మన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. యూజీసీ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాలను ప్రకటించినట్టు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జీఎం జగన్నాథరాజు వెల్లడించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయా లు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 30 సబ్జెక్టుల్లో మార్చి 29, 29 తేదీల్లో ఏపీసెట్‌ను నిర్వహించగా, 27,075 మంది హాజరయ్యారు. వీరిలో 2,143 మంది అర్హత సాధించారు. వీరిలో 1,016 మంది పురుషులు, 1,127 మంది మహిళలు ఉన్నారు. అర్హత పొందిన అభ్యర్థుల రిజిస్ర్టేషన్ నంబర్లు, సబ్జెక్టుల వారీగా, కేటగిరీలు వారీగా నిర్ణయించిన కట్ ఆఫ్ మార్కులు వివరాలను ఏపీసెట్ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యోగ నియామకాల సమయంలో అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు, రికార్డులను సంబంధిత నియామక సంస్థలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.










Comments