ఓటీటీలోకి దృశ్యం 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దృశ్యం సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం దృశ్యం 3. మోహన్ లాల్, మీనా, అన్సీబా హాసన్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రలో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో పాటు తెలుగులో ఈ చిత్రం రిలీజైంది. తెలుగులో తొలి రెండు భాగాల్లో వెంకటేశ్‌తో రీమేక్ చేయించగా.. ఈ సారి మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేసి వదిలారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికి 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్ శుభవార్త చెప్పింది.
జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.







Comments