కోదండరాముడి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట
ఆంధ్రప్రదేశ్ : ఒంటిమిట్టలో జరగబోయే కోదండరాముడి కళ్యాణానికి TTD భారీ ఏర్పాట్లు చేసింది. వేడుక జరిగే ప్రధాన వేదికతో పాటు భక్తులు కూర్చొనేందుకు ఆలయ సమీపంలో గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనుంది. అలాగే కళ్యాణం అనంతరం తలంబ్రాల ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు రేపు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.









Comments