కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన బంగారం
బంగారం ధరలు ఇవాళ(శుక్రవారం) స్వల్పంగా తగ్గాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది. ఇవాళ(శుక్రవారం) ఉదయం.. తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉంది. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బంగారం ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,21,470
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,11,340
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹91,100
విజయవాడలో బంగారం ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,21,470
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,11,340
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹91,100
బెంగళూరులో బంగారం ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,21,470
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,11,340
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹91,100
అహ్మదాబాద్‌లో బంగారం ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,21,520
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹1,11,390
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం - ₹91,150
అయితే.. ఇటివల బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగిన నేపథ్యంలో.. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ3)లో పసిడి గిరాకీ 16 శాతం తగ్గినట్లు సమచారం.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
 
Comments