కువైట్, బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణుల వర్షం
దుబాయి : కువైట్, బహ్రెయిన్పై ఇరాన్ బుధవారం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ దేశంలోని వ్యూహాత్మకమైన ఖెష్మ్ ద్వీపంపై అమెరికా దాడికి ప్రతిస్పందనగానే తాము ఈ రెండు దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఐబీ ప్రకటించింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ తాకటంతో కువైట్లోని అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దాడిలో ఎయిర్పోర్టులో పనిచేసే ఒక భారతీయుడు మరణించినట్లు, 63 మంది గాయపడినట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో కొన్ని గంటలపాటు కార్యకలాపాలను నిలిపివేశారు. మరోవైపు, కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడిని భారత్ ఖండించింది. సాధారణ పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవటం సరికాదని సూచించింది. దాడిలో గాయపడ్డ 63 మందిలో కొందరు భారతీయులు ఉన్నారని వెల్లడించింది.










Comments