చర్చలకైనా, యుద్ధానికైనా మేం రెడీ: ఇరాన్
దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. హింసకు మొస్సాద్ కారణమని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల ర్యాలీల కోసం వేలమందిని రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా చెప్పింది. టెహ్రాన్‌తోపాటు ఇతర ప్రధాన సిటీల్లోనూ ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపింది.









Comments