• Jun 05, 2026
  • NPN Log

    ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలోని న్యాయకళాశాలల్లో మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ రెగ్యులర్‌ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌- 2026 ఫలితాలను గురువారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ కుమార్‌, టీజీ లాసెట్‌ కన్వీనర్‌, టీజీసీహెచ్‌ఈ కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 66,864 మంది దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది హాజరయ్యారు. వీరిలో 39,673 మంది అర్హతసాధించగా, ఉత్తీర్ణత శాతం 72.96గా నమోదైంది. ర్యాంక్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

    మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీకి 349వ ర్యాంక్‌

    మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ లాసెట్‌ ఫలితాల్లో 349వ ర్యాంక్‌ సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఇటీవలే ఆయన పోలీసులకు లొంగిపోయారు. న్యాయవాది కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు.. 60ఏళ్ల వయస్సులో లాసెట్‌ రాసి ఉత్తమ ఫలితాన్ని సాధించారు. గత నెలలో ఆయన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష కూడా పాసయ్యారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement