త్వరలో మరో 1,597 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్?
హైదరాబాద్ : ఇటీవల 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ మరో 1,597 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సంబంధిత ఫైల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించడంతో ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వాటిలో 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 24 డిప్యూటీ డీఈవో, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుందని అధికారులు చెబుతున్నారు.










Comments