• Apr 03, 2026
  • NPN Log

    చాలామంది తలకు నూనె రాసుకుని దిండుపై నిద్రపోతారు. కానీ ఉదయం లేచేసరికి దిండు పసుపు రంగులో మురికిగా కనిపిస్తుంది. ఎంత రుద్దినా ఈ నూనె మరకలు పోకపోవడంతో కొందరు దిండును మార్చేస్తారు. అయితే, అలా చేయకుండా ఇంట్లోనే సులభంగా ఈ మరకలను తొలగించుకోవచ్చు.

    బేకింగ్ సోడా

    దిండుపై ఉన్న నూనె మరకలపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి కొంతసేపు ఉంచాలి. తర్వాత మెల్లగా రుద్ది కడిగితే మరకలు తగ్గుతాయి.

    నిమ్మరసం

    నిమ్మరసం సహజ క్లీనర్‌లా పనిచేస్తుంది. దిండు కవర్‌ను నిమ్మరసంలో అరగంట పాటు నానబెట్టి, తర్వాత రుద్ది కడిగితే నూనె మరకలు తొలగిపోతాయి.

    డిటర్జెంట్

    దిండుపై ఉన్న నూనె మరకలను తొలగించడానికి డిటర్జెంట్ కూడా మంచి పరిష్కారం. ఒక బకెట్ నీటిలో డిటర్జెంట్ కలిపి, దిండు కవర్లను 2–3 గంటలు నానబెట్టి తర్వాత బాగా రుద్ది కడగాలి.

    గోరువెచ్చని నీటితో కడగడం

    మరకలు చాలా గట్టిగా ఉంటే గోరువెచ్చని నీటితో కడగాలి. అయితే ఎక్కువ సేపు వేడి నీటిలో నానబెట్టకూడదు.

    జాగ్రత్త

    దిండు కవర్‌ను తరచూ ఉతకడం వల్ల మురికి పేరుకుపోకుండా ఉంటుంది. తలకు నూనె రాసుకున్నప్పుడు ప్రత్యేకంగా పాత కవర్ వాడితే మరింత మంచిది. ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే మీ దిండు ఎప్పుడూ శుభ్రంగా, తాజాగా ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement