• Jun 05, 2026
  • NPN Log

    న్యూయార్క్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆరుగురు కుటుంబసభ్యులను అతి కిరాతకంగా తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం 12.12 గంటల సమయంలో మస్కటిన్‌, పార్క్ ఎవెన్యూలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు మస్కటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు.

    ఇంట్లో నలుగురు వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ నలుగురిని కాల్చి చంపిన వ్యక్తిని 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్‌లాండ్‌గా గుర్తించారు. పోలీసులు ఇంటి దగ్గరకు రావడానికి ముందే అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. మిల్ స్ట్రీట్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి ఓ వ్యక్తిని చంపేశాడు. తర్వాత గ్రాండ్‌వ్యూ ఎవెన్యూలో మరో వ్యక్తిని కాల్చి చంపాడు. అనంతరం ఓ బ్రిడ్జి దగ్గర తుపాకితో కాల్చుకుని ర్యాన్ విల్లిస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

    పోలీసులు అతడి శవాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ర్యాన్ విల్లిస్‌ చేతిలో హత్యకు గురైన వారందరూ అతడి కుటుంబసభ్యులేనని తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడైంది. నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement