నేడే PSLV-C62 ప్రయోగం
ఆంధ్ర ప్రదేశ్ : ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.










Comments