పదేళ్లలో పంచాయతీలకు రూ.11,111 కోట్లు
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం గత పదేళ్లలో రూ.11,111 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. గడిచిన ఐదేళ్లలో గ్రామ పంచాయతీలకు కేటాయింపులు 80శాతం పెరిగి రూ.9,050కోట్లకు చేరుకున్నాయని వివరించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన నిధులను కూడా కేంద్రం త్వరలోనే విడుదల చేయనుందని పేర్కొన్నారు. 2024-25కు సంబంధించిన మొదటి విడత నిధులైన రూ.260 కోట్లను వెంటనే విడుదల చేస్తారని, దశల వారీగా మిగిలిన రూ.2,500 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తారని కిషన్రెడ్డి తెలిపారు. కాగా, ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్నాయుడు సందడి చేశారు. బుధవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల సహాయ మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.










Comments