పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు కుమార్తె ఎస్. హేనిషా(32) డిగ్రీ వరకు చదువుకొని ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తుండడంతో జీవితంపై విరక్తి చెందిన యువతి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు









Comments