బంగ్లా మ్యాచుల నిర్వహణకు పాక్ రెడీ!
భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో T20 ప్రపంచకప్ మ్యాచులు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో శ్రీలంకలో బంగ్లా మ్యాచులు సాధ్యం కాకపోతే తమ దేశంలో జరిపేందుకు సిద్ధమని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని గ్రౌండ్లు రెడీగా ఉన్నాయని అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. కాగా బంగ్లా రిక్వెస్ట్‌పై ఇంకా ఐసీసీ నిర్ణయం తీసుకోలేదు.










Comments