బాబు గారి నాగరికత*? *కే వీ రమణ*
బాబు గారి నాగరికత.
కే వీ రమణ
ఉరవకొండ npn,news.జనవరి 11:నాగరికత అంటే,నగరాన్ని నదీ గర్భంలో నిర్మించి,లక్ష రూపాయలు ఖర్చ అయ్యేదానికి కోటి రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి,వరదలలో ప్రజలును ముంచడమా? ప్రజాధనాన్ని ఆదా చేసి, *అభివృద్ధి వికేంద్రీకరణ* తో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమా?
అమరావతి నిర్మాణం గురించి *అనాగరికులకు* ఏమి తెలుసునని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు,ఇంతకీ బాబు గారు చెప్పిందే నాగరికతా?లేక నిజమైన నాగరికత ఏమైనా ఉన్నదా? అంటే మానవ పరిణామ క్రమంలో,టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో నదులను ఆధారంగా చేసుకుని నాగరికత అభివృద్ధి చెందిన మాట నిజమే,అయితే *టెక్నాలజీకి నేనే అంబాసిడర్* అని చెప్పుకునే బాబు గారు, అమరావతిని నదీ గర్భంలో నిర్మించ తలపెట్టి,తాను తప్పు చేస్తూ, ఒప్పుగా మలుచు కోవడానికి,ప్రశ్నించిన వారిని అనాగరికులు అంటున్నాడు.
నేడు బాబు గారు చెబుతున్నట్లు అమరావతిని నిర్మిస్తున్నది నదీ పరివాహక ప్రాంతం కూడా కాదు,సరాసరి నదీ గర్భంలో నిర్మిస్తూ,నదీ గర్భానికి,నదీ పరివాహ ప్రాంతానికి కూడా తేడా తెలియదని హూంకరిస్తూ ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నాడంటే ఇంతకంటే అనాగరికం ఏముంటుంది?
ఒకవైపు *కృష్ణా నది, మరోవైపు *బుడమేరు*,ఇంకో వైపు *కొండవీటి వాగు* ఈ మూడు నదులు కలిసే చోటును నదీ పరివాహక ప్రాంతం అంటారా? నదీ గర్భం అంటారా? మెడ మీద తల ఉన్న ఎవరైనా *నదీ గర్భమే* అంటారు. ఈ మూడు నదులు అమరావతి మీద పడకుండా మళ్లించడానికి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి,తాను అనాగరిక చర్యలకు పాల్పడుతూ,ప్రశ్నించిన వారిని అనాగరికులని ఎదురు దాడి చేస్తున్నాడు.
రాష్ట్ర సంపదనంతా అమరావతికి ఖర్చు పెట్టి, అభివృద్ధిని కేంద్రీ కరించి,మిగిలిన ప్రాంతాలను అశ్రద్ధ చేస్తే నాగరికత అవుతుందా?
ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తూ వెళితే,వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ పరిస్థితి ఏమిటి?అమరావతికి లక్ష కోట్లు పెడితే,అత్యంత వెనుకబడిన రాయలసీమకు పదివేల కోట్లు అయినా ఖర్చు పెట్టాలి కదా? వీటి దృష్ట్యా నాగరికత అంటే ఏమిటో, అనాగరీకులు ఎవరో, వెనుకబడిన ప్రాంతాల ద్రోహి ఎవరో తెలిసిపోతుంది.










Comments