బ్రిటన్లో 23ఏళ్ల సుదీర్ఘ విడాకుల కేసు..
న్యూఢిల్లీ : బ్రిటన్ న్యాయ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన విడాకుల కేసుల్లో ఒకటి, భారత సంతతికి చెందిన 61 ఏళ్ల వర్షా గోహిల్కు సంబంధించిన కేసులో ఆమెకు అనుకూలంగా అక్కడి హైకోర్టు తీర్పు వెలువరించింది. 23 ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో వర్షాకు 6.6 మిలియన్ పౌండ్ల మేర (రూ.70 కోట్లకుపైనే) పరిహారాన్ని కోర్టు ఖరారు చేసింది. వర్ష.. తన భర్త బద్రేశ్ గోయల్ నుంచి విడాకులు కోరుతూ 2002 మే నెలలో కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు వేసే సమయానికి బద్రేశ్కు ఉన్న ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించకుండా కొంత దాచారంటూ ఆమె న్యాయపోరాటం ప్రారంభించారు. భద్రేశ్ మొత్తం ఆస్తుల్లో చట్టబద్ధమైన ఆస్తులను నిర్ధారించిన కోర్టు.. వాటిల్లో 23.82ు వాటా వర్షకు పరిహారంగా ఇవ్వాలని తీర్పు వెలువరించింది.










Comments