బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ జేఏసీ బంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లకు కేబినెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించి, 9వ షెడ్యూల్ లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం, ధర్మ సమాజ్ పార్టీ,ఎంఆర్పిఎస్ రాష్ట్ర, జిల్లా ,మండల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రోజున చిట్యాల మండల కేంద్రంలో బీసీ లకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని బీసీ జేఏసీ ఇచ్చిన బందులో భాగంగా పాల్గొని షాపులు, వాహనాలు,స్కూలు బందు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ చేపూరి ఓదెలు,ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, MRPS జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు లు మాట్లాడుతూ దేశ,రాష్ట్రవ్యాప్తంగా అధికంగా ఉన్న బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంస్థ గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కానీ భారత రాజ్యాంగం ప్రకారం జీవో నెంబర్ 9 చెల్లుబాటు కాదు అందులో భాగంగానే సుప్రీంకోర్టు, హైకోర్టు స్టే విధించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బిసి రిజర్వేషన్ బిల్లుని ఆమోదించి,9వ షెడ్యూల్లో పొందుపరిచినట్లయితే అది ఒక రక్షణ కవచం వలె ఉంటుందన్నారు. ఇలా చేయని పక్షంలో రాష్ట్రంలో ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో కలిసి నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు భారీ ఎత్తున చేస్తామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్, నాయకులు గడ్డం సదానందం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పర్లపల్లి కుమార్,ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్ నాయకులు పర్లపల్లి వంశీ, MRPS మండల అధ్యక్షుడు దొడ్డ శంకర్, మండల నాయకుడు పర్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు..
Comments