• Jun 05, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : భారత్‌పై మరోసారి అదనపు టారి్‌ఫల మోత మోగనుంది. భారత్‌ నుంచి ఎగుమతయ్యే సరుకులపై 12.5% అదనపు సుంకాలను విధించాలని అమెరికా యోచిస్తోంది. ఎగుమతి సరుకుల తయారీలో బలవంతపు శ్రమశక్తి వినియోగాన్ని ఇందుకు కారణంగా చూపిస్తోంది. అతి కీలక వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తీసుకునివచ్చేందుకు ఇరుదేశాలూ కసరత్తు చేస్తున్న వేళ, అగ్రరాజ్యం వైఖరి ఆశ్చర్యపరుస్తోంది. అయితే, అదనపు టారి్‌ఫపై ఇదే తుది నిర్ణయం కాదని, అమెరికాతో యఽథాప్రకారం చర్చలు కొనసాగిస్తామని భారత్‌ స్పష్టం చేసింది. భారత్‌ వంటి దేశాలు సరైన వేతన, భద్రతా ప్రమాణాలను పాటించకుండా చీప్‌ లేబరును వాడి (బలవంతపు శ్రమశక్తి) చౌకగా తయారుచేసిన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయని అమెరికా చాలాకాలంగా ఆక్షేపిస్తోంది. దీనివల్ల అసమ పోటీ తలెత్తి, ఆ తరహా సరుకులను తమ కార్మికులు తయారుచేసిన ఉత్పత్తులు తట్టుకోలేని పరిస్థితి ఉన్నదని వాదిస్తోంది. ఇదే అంశంపై భారత వాణిజ్య విభాగం అధికారులతో యూఎ్‌సటీఆర్‌(అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం) అసిస్టెంట్‌ బ్రెండన్‌ లించ్‌ నేతృత్వంలోని బృందం చర్చలు జరుపుతోంది. మూడురోజుల సమావేశాల్లో రెండోరోజు అయిన మంగళవారం లించ్‌ బృందం 92 పేజీల నివేదిక విడుదల చేసింది. ఎగుమతి ఉత్పత్తుల్లో బలవంతపు శ్రమశక్తిని నిరోధించలేకపోతున్న మొత్తం 60 దేశాల్లో భారత్‌ కూడా ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. భారత్‌ తమకు అతి కీలక భాగస్వామ్య దేశమని అంటూనే, ఎగుమతి సంబంధిత నిబంధనలను ఎవరూ ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని తెలిపింది. అందువల్లే అత్యధికంగా 12.5ు అదనపు సుంకాలను ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రతిపాదిత అదనపు టారి్‌ఫను వెనక్కి తీసుకోవాలని కోరేందుకు భారత్‌ సిద్ధమవుతోందని రాయిటర్స్‌ తెలిపింది.

    ఆ దేశాలపై మాత్రం టారిఫ్‌ 10 శాతమే

    ఉల్లంఘనలు ఒకే తరహావి అయినప్పుడు చర్యలూ సమానంగానే ఉండాలి. కానీ, టారి్‌ఫల విషయంలో యూఎ్‌సటీఎస్‌ భిన్న వైఖరి అనుసరించడం చర్చనీయాంశం అయింది. ఎగుమతి సరుకుల తయారీకి బలవంతపు శ్రమశక్తిని వాడుతున్నట్టు మొత్తం 60 దేశాలను యూఎ్‌సటీఎస్‌ గుర్తించింది. ఇందులో భారత్‌ సహా 54 దేశాలకు 12.5ు అదనపు టారి్‌ఫను ప్రతిపాదించిన అమెరికా పాకిస్థాన్‌ సహా తక్కిన ఆరు దేశాలకు మాత్రం 10ు టారి్‌ఫను మాత్రమే సిఫారసు చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement