• Jul 28, 2026
  • NPN Log

    శెట్టూరు (మాకొడికి), జూలై 27:

    దేశ మాజీ రాష్ట్రపతి, 'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా', భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 11వ వర్ధంతి వేడుకలను సోమవారం మాకొడికి ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కలామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ​ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. దేశ శాస్త్ర, సాంకేతిక మరియు రక్షణ రంగాలకు అబ్దుల్ కలామ్ అందించిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ అత్యంత నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, దేశ యువతకు ఆయన ఎనలేని స్ఫూర్తిని అందించారని తెలిపారు. విద్యార్థులు గొప్ప కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని కలామ్ చూపిన మార్గాన్ని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

    ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఉమాపతి, శ్రీ నాగిరెడ్డి, శ్రీ బద్దేనాయక్, శ్రీ ఓబులేషు, శ్రీమతి రమాదేవి, శ్రీమతి శిరీష తదితరులు పాల్గొని కలామ్ ఆశయాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులంతా కలామ్ చూపిన బాటలోనే నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).