• Apr 02, 2026
  • NPN Log

    తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా నిర్వహించిన శ్రీవారి వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. మొదటి రెండు రోజులూ శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిచ్చి స్నపనంతో సేదదీరిన మలయప్పస్వామి బుధవారం శ్రీదేవి, భూదేవితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులతో కలిసి భక్తులను అనుగ్రహించారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే గరుడ వాహన సేవను వసంతోత్సవం సందర్భంగా రద్దు చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement