విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి
చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.










Comments