వివరాలు ఇవ్వకపోతే ఈనెల జీతం రాదు: ఆర్థిక శాఖ
తెలంగాణ : ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయని ఉద్యోగులకు ఈనెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గతనెల ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు 5.21లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22లక్షల మంది, 4.93లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.
Comments