వైసీపీ నేతలను.. కాలర్పట్టి నిలదీయండి
అనంతపురం: నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. నియోజకవర్గ పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు రూ.31 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ 870 మంది సీఎంఆర్ఎ్ఫకు దరఖాస్తు చేసుకోగా....595 మంది లబ్ధిదారులకు ఊరట లభించిందని, 16 విడతల్లో రూ. 5.50 కోట్లు మంజూరయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా మంజూరు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. సీఎం చంద్రబాబు డబ్బు గురించి ఆలోచించకుండా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రకా్షరెడ్డి, వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే.. టీడీపీ నాయకులు వాళ్లకు దీటుగా సమాధానం ఇవ్వాలని అన్నారు. నోరుంది కదా అని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రకా్షరెడ్డి సోదరులు ఐదేళ్లూ దోపిడీ చేసిన డబ్బుతో హైదారాబాద్, బెంగళూరులో ఆస్తులు పోగేసి, ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నారంటూ ఆమె మండి పడ్డారు.
Comments