సింహాచలం దేవస్థానం ఈవో గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ సుజాత...
విశాఖపట్నం (సింహాచలం)
వరాహ లక్ష్మీనరసింహస్వామి కార్యనిర్వాహణ అధికారి, దేవాదాయ డిప్యూటీ కమిషనర్ గా శ్రీమతి ఎన్.సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.మొదటగా ఆలయ పరిధిలో కప్పస్తంభం ఆలింగణం చేసుకుని.బేడా ప్రతిక్షణం నిర్వహించారు అనంతరం స్వామి వారిని దర్శించుకోవడం తదనంతరం ఆలయ వేద పండితుల చేత వేదాశీర్వచనాలు స్వీకరించారు.ఆలయ సహాయ కార్యదర్శిగా కే తిరుమలేశ్వర్రావు,అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యదర్శి వేండ్ర రమణమూర్తి చేతుల మీదగా స్వామివారి చిత్రపటం,ప్రసాదం అందించడం జరిగింది. ఈఓ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేయడం జరిగింది.ఈ ఓ ఎన్.సుజాత మీడియాతో మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం సకల సౌకర్యాల కల్పనలో పూర్తిస్థాయిలో మార్పులు చేపడుతామని. ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విధాలా దేవస్థానం సహకరిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఓ నాయుడు,ఆలయ పర్యవేక్షణ అధికారులు,వైదిక సిబ్బంది పాల్గొనడం జరిగింది.










Comments