అఖండ-2 మూవీ నిర్మాతలకు ఊరట
తెలంగాణ : అఖండ-2 మూవీ నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. టికెట్ ధరల పెంపు జీఓను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందంటూ 14రీల్స్ సంస్థ డివిజన్ బెంచ్‌కు వెళ్లగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినాలని పేర్కొంది. ఈ కేసు విచారణ మళ్లీ అక్కడే జరగాలని తెలిపింది.









Comments