సార్వత్రిక ఆరోగ్య దినోత్సవం: 5 లక్షల వరకు ఉచిత వైద్యం
కర్నూలు(లీగల్): సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవాన్ని కొత్తపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత, నగదురహిత వైద్యం అందుతుందన్నారు. అర్హులైన వారు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని, వివరాలకు 14555 నెంబర్ను సంప్రదించాలని కౌన్సిల్ శివరాం సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీవాణి, సిబ్బంది పాల్గొన్నారు.









Comments