స్థాయి సంఘం భేటీ: బడ్జెట్‌కు ఆమోదం
కర్నూలు(కార్పొరేషన్): కర్నూలు నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం మేయర్ బి.వై.రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ భేటీలో 2025-26 బడ్జెట్‌తో పాటు 16 తీర్మానాలను ఆమోదించారు. ప్రధానంగా ప్రేమ్‌నగర్, ఎల్‌ఐసీ, సీ క్యాంప్ తదితర పార్కుల అభివృద్ధి, వీధి దీపాలు, వాకీటాకీల కొనుగోలు, రోడ్ల విస్తరణ పనులకు నిధులు కేటాయిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సమావేశంలో కమిషనర్ పి.విశ్వనాథ్, సభ్యులు పాల్గొన్నారు.








Comments