ఇరాన్.. పూర్తిగా పతన స్థితిలో ఉంది : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘తాము కుప్పకూలిపోయేలా ఉన్నామని కాసేపటి క్రితమే ఇరాన్ మాకు సమాచారం ఇచ్చింది. వారు తమ నాయకత్వంలో ఏర్పడిన విభేదాలను సరిచేసుకునే క్రమంలో ఉన్నారు. వీలైనంత త్వరగా హోర్ముజ్ జలసంధిని తెరవాలని కోరుకుంటున్నారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో చర్చల విషయంగా ఇరాన్ పాలకులు, రెవెల్యూషనరీ గార్డ్స్ మధ్య విభేదాలు తలెత్తినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.









Comments