• Apr 30, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగ వృద్ధికి శ్రేష్ఠమైన కంపెనీల్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు యాక్సెంచర్‌, అమెజాన్‌ వరుసగా 2, 3 స్థానాలను దక్కించుకున్నాయి. ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌, అమెరికన్‌ టెక్‌ కంపెనీ శాప్‌ 4, 5 స్థానాల్లో ఉన్నాయి. వృత్తి నిపుణుల సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పోర్టల్‌ లింక్డిన్‌ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇది పదో వార్షిక జాబితా. ఇందులో 25 కంపెనీలకు చోటు దక్కింది. అందులో అధికం టెక్నాలజీ కంపెనీలే. మరిన్ని విషయాలు..

    ఈసారి కొత్తగా 10 సంస్థలకు స్థానం దక్కింది. శాప్‌, ఎన్‌విడియా, హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్‌, శాన్‌డి్‌స్క, మార్వెల్‌ టెక్నాలజీ, థాంప్సన్‌ రాయిటర్స్‌ అందులో ప్రముఖమైనవి.

    ఈ టాప్‌ కంపెనీలకు నిపుణుల లభ్యత అధికంగా ఉన్న ప్రాంతాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌కు రెండో స్థానం దక్కింది. ఢిల్లీ, ముంబై, చెన్నై ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

    ఉద్యోగుల నియామకాల ట్రెండ్‌ మారుతోందని లింక్డిన్‌ రిపోర్టు ప్రస్తావించింది. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వాక్చాతుర్యం, కృత్రిమ మేధ (ఏఐ) భర్తీ చేయలేని సమస్యల పరిష్కార నైపుణ్యత కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపింది.

    టాప్‌ కంపెనీలు

    1. ఇన్ఫోసిస్‌

    2. యాక్సెంచర్‌

    3. అమెజాన్‌

    4. జేపీ మోర్గాన్‌ చేజ్‌

    5. శాప్‌

    6. ఐబీఎం

    7. ఫిడెలిటీ ఇన్వె్‌స్టమెంట్స్‌

    8. ఆల్ఫాబెట్‌

    9. ఈవై

    10. వెల్స్‌ ఫార్గో

    11. ఎలి లిల్లీ

    12. ఎన్‌విడియా

    13. హెచ్‌ఎ్‌సబీసీ

    14. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా

    15. హెచ్‌పీ

    16. మైక్రోసాఫ్ట్‌

    17. మోర్గాన్‌ స్టాన్లీ

    18. శాన్‌డి్‌స్క

    19. మార్వెల్‌ టెక్నాలజీ

    20. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌

    21. రాయల్‌

    కరేబియన్‌ గ్రూప్‌

    22. ఆర్‌టీఎక్స్‌

    23. స్ర్టైకర్‌

    24. థాంప్సన్‌ రాయిటర్స్‌

    25. సర్వీస్‌ నౌ

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).