ఈనెల 16 లోపు పెన్షన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి: కోడుమూరు ఎంపీడీవో ఏ.సి. రాముడు
కోడుమూరు: మండల పరిధిలో సామాజిక భద్రతా పెన్షన్‌కు అర్హత ఉన్న వారు ఈ నెల 16వ తేదీలోపు సమీప గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు ఎంపీడీవో ఏసీ రాముడు సూచించారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు అవసరమైన ధ్రువపత్రాలతో సచివాలయ సిబ్బందిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలన్నారు.దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత ప్రమాణాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.










Comments