దేవినేని రమణకు ఘన నివాళులు
NPN న్యూస్ నందిగామ దివంగత మాజీ మంత్రి దేవినేని రమణ జయంతి సందర్భంగా నందిగామ రైతుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందిగామ అభివృద్ధికి రమణ చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమా పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









Comments