• Jul 27, 2026
  • NPN Log

    అమరావతి : ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు  వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. జులై 20 నుంచి 29 వరకు మొత్తం 10 రోజుల పాటు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జులై 22 నుంచి 31 వరకూ చేపట్టనున్నారు.

    జులై 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు. ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి ఆగస్ట్ 7 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ / రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement