కన్నుల పండువగా స్వర్ణరథోత్సవం
తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం మలయప్పస్వామి మూడు వాహనాలపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై అధిష్ఠించి నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథోత్సవం వైభవోపేతంగా సాగింది. ప్రత్యేకించి పలువురు మహిళలు స్వర్ణరథాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ముందుకు లాగారు. వీరిలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, వేమిరెడ్డి ప్రశాంతి, సినీ నటుడు బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు ఉన్నారు. రాత్రి 7 గంటలకు విశేష అలంకరణలో పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా గజవాహనంపై ఊరేగుతూ భక్తులను మలయప్పస్వామి ఆశీర్వదించారు. గరుడసేవకు వచ్చిన భక్తులు ఆదివారం రాత్రే తిరుగు ప్రయాణం కావడంతో ఉదయం గ్యాలరీలు కాస్త పలుచగా కనిపించినప్పటికీ సా యంత్రం స్వర్ణరథోత్సవంలో మాత్రం నిండుగా కనిపించాయి.









Comments