జనప్రవాహమైన ఖైరతాబాద్
ఖైరతాబాద్ : ఎక్కడ చూసినా ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు వచ్చిన జనసందోహమే. ఆదివారం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఖైతరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ జన ప్రవాహాన్ని తలపించాయి. సుమారు 5 లక్షల మంది భక్తులు భారీ గణేషుడిని దర్శించుకున్నారని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ బాధ్యులు తెలిపారు. చాలా మంది దూరం నుంచే లంబోదరుడిని దర్శనం చేసుకుని వెళ్లిపోయారు.
భక్తుల తాకిడితో లక్డీకాపూల్, ఎన్టీఆర్ మార్గ్, సైఫాబాద్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలను సుగమం చేసందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కాగా, మహాగణపతిని ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.









Comments