కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం
ఆంధ్ర ప్రదేశ్ : కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.









Comments