• Dec 18, 2025
  • NPN Log

     

    Npn, news.పేదలకు వైద్య విద్య దూరం ప్రజారోగ్యానికి ముప్పు

    వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 107 108 590 రద్దు చేయాలి

    సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా

    అనంతపురం అర్బన్:: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలో పిపిపి విధానాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు,, పిపిపి విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు భారీకేట్లు ఎక్కి కలెక్టరేట్లోకి చుచుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ జిల్లా కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. ప్రతిపక్షంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైద్య విద్యకు పేదలకు దూరం చేసే పద్ధతుల్లో 107 108 జీవోలను తీసుకువచ్చి వైద్య విద్యను 50% ప్రైవేటీకరణ చేస్తే అప్పటిలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో 107 108 జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలలో భాగంగా జీవోలను రద్దు చేయకపోగా 100% వైద్య విద్యను పిపిపి విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పిపీపి విధానం వల్ల కేవలం వైద్య విద్యార్థుల నష్టపోవడంతో పాటు సామాన్య ప్రజలు వైద్యం ఉచితంగా చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదన్నారు. వైద్య కళాశాల రాష్ట్రానికి వస్తే దాని పక్కనే ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాట అవుతుంది దానివల్ల సామాన్య ప్రజలు వైద్యం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. పిపిపి విధానం వల్ల పేదలకు విద్యతోపాటు వైద్యం కూడా దూరం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకవైపు లక్షలలో ఖర్చుపెట్టి ఇంటర్ తో పాటు నీట్ శిక్షణకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసే చదివిస్తున్నారు నీటిలో అర్హతలు సాధించిన తరువాత వారికి పిపిపి విధానం వల్ల రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో లేకుండా పోతాయని మండిపడ్డారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉండాల్సిన వైద్య విద్యను లాభాల కేంద్రంగా మార్చే ప్రయత్నం పిపిపీ విధానమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 590 ద్వారా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాల్సిన ఈ వైద్య కళాశాలలను ప్రైవేట్ భాగ్యసామికే అప్పగించడం ప్రభుత్వ భూములు భవనాలు మౌలిక సదుపాయాలు ఆసుపత్రులు దీర్ఘకాలం పాటు ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిపిపీ విధానంలో యాజమాన్య కోటాలో సీట్లకు భారీ ఫీజులు విధించే అవకాశం ఉందని దీనివల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతుందని తెలిపారు, వైద్య విద్య సీట్లు పెరుగుతాయన్న ప్రభుత్వ హామీలు అపద్ధపు మాటలేనని విమర్శలు చేశారు, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వేగవంతం చేసినట్లే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్ 107 108 590 రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి సహాయ కార్యదర్శిలు మల్లికార్జున రాజారెడ్డి నగర కార్యదర్శి శ్రీరాములు కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ టి నారాయణస్వామి పద్మావతి జిల్లా కార్యవర్గ సభ్యులు రమణయ్య రాజేష్ రమేష్ నాగార్జున కుళ్లాయిస్వామి సంతోష్ కుమార్  పెద్దయ్య నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు రాయుడు రూరల్ మండల కార్యదర్శి నరేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆంజనేయులు నరసింహ వెంకట్ నాయక్ మంజు వంశీ చందు నాని అఫన్ సన్నీ సిపిఐ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement