• Sep 20, 2026
  • NPN Log

    గాజా : గాజా సిటీలోని తాల్‌ అల్‌-హవా ప్రాంతంలో ఓ ఆరంతస్తుల నివాస భవనం బుధవారం ఒక్కసారిగా కుప్పకూలడంతో కనీసం 20 మంది దుర్మరణం చెందారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల వల్ల ఈ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు హమాస్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీ ప్రతినిధి మహమూద్‌ బాసల్‌ తెలిపారు. భవనం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించినప్పటికీ, యుద్ధం వల్ల ఇళ్లు కోల్పోయిన సుమారు 10 కుటుంబాలకు చెందిన 100 మంది నిరాశ్రయులు వేరే దిక్కులేక అందులోనే ఆశ్రయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement