గుడ్డు.. సూపర్ ఫుడ్..!
అమరావతి : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఆహారాల్లో కోడి గుడ్డు ముందువరుసలో ఉంటుంది. మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు గుడ్డులో లభిస్తాయి. చికెన్, మటన్ లేదా కొన్ని రకాల పప్పులతో పోల్చితే కోడిగుడ్డ ధర చాలా తక్కువ. కానీ.. దీనిలో లభించే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘సూపర్ ఫుడ్’, ‘కంప్లీట్ ప్రోటీన్’ అంటారు. ఇంతటి అమోఘమైన పోషక విలువలున్న కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 1,190.88 లక్షల కోళ్లతో రాష్ట్రంలో పౌల్ర్టీ రంగం బలీయంగా ఉండగా.. 2024-25లో 2,739.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న 14,911 కోట్ల గుడ్లలో ఇది 18.37 శాతం. ఇక రాష్ట్రంలో తలసరి గుడ్ల వినియోగం ఏడాదికి 108గా ఉండగా. జాతీయ సగటు 104గా ఉంది.










Comments