• Oct 24, 2026
  • NPN Log

    చాలామంది తేనెను సహజమైన తీపి పదార్థంగా ఉపయోగిస్తారు. చక్కెర బదులుగా తేనె తీసుకోవడం మంచిదని భావిస్తారు. నిజానికి తేనెలో కూడా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు, దంత సంబంధిత సమస్యలు ఉన్నవారు తేనె వాడకంలో జాగ్రత్తలు వహించాలి. అధికంగా దీన్ని వినియోగిస్తే తలెత్తే సమస్యలేంటో తెలుసా..?

    రక్తంలో చక్కెర స్థాయిలు..

    తేనెలోని చక్కెర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అందుకే మధుమేహంతో బాధపడేవారు దీన్ని అధిక పరిమాణంలో తీసుకోవడం మంచిది కాదు. వైద్యుడిని సంప్రదించి ఎంత పరిమాణంలో తేనెను వినియోగించాలో తెలుసుకోవాలి.

    బరువు పెరుగుదల..

    తేనెలోనూ కేలరీలు ఉంటాయి. మీరు ఆహారం ద్వారా ఎక్కువ కేలరీలు తీసుకున్న తరువాత అదనంగా తేనె వినియోగించడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయి. కొందరు గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుందని నమ్ముతుంటారు. అయితే ఈ నమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

    దంత ఆరోగ్యం

    తేనెలోని చక్కెర శాతం దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. రోజూ తేనె వినియోగిస్తూ.. దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే ఈ సమస్య రావచ్చు. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా దంతక్షయం రాకుండా నివారించగలం.

    జీర్ణ సమస్యలు..

    ఎక్కువ మొత్తంలో తేనె తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశమూ ఉంది. కడుపు ఉబ్బరం, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు. అందుకే తేనె పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement