ఆరోగ్యానికి పైనా‘పిల్’.. ఈ పండు తింటే ఇన్ని ప్రయోజనాలా..
అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి పోషకాలనూ అందిస్తుంది. ఈ పండులో విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీర పనితీరును మెరుగుపరుస్తాయి. పైనాపిల్ తినటం వల్ల లభించే ప్రయోజనాలేంటో తెలుసా..?
రోగనిరోధక శక్తి: పైనాపిల్లో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్.. ఇది శరీర కణాలను ఆక్సీకరణ నుంచి కాపాడుతుంది.
జీర్ణక్రియ: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ పండులోని ఫైబర్ పేగుల ఆరోగ్యాన్నీ రక్షిస్తుంది.
గుండె ఆరోగ్యం: పైనాపిల్లోని పొటాషియం రక్తపోటును నియంత్రించగలదు. గుండె ఆరోగ్యాన్ని కాపాడగలదు.
ఎముకల పెరుగుదల: పైనాపిల్లోని మాంగనీస్ ఎముకల పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇది కీళ్లనొప్పులనూ తగ్గిస్తుందని కొందరు చెబుతున్నప్పటికీ దానికి సమగ్ర ఆధారాలు లేవు. మరో ముఖ్యమైన విషయం.. పైనాపిల్లో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయికి అనుగుణంగా ఈ పండు తీసుకోవాలి.









Comments