గ్రేటర్‌లో.. 2వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్ : గ్రేటర్‌లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానమంత్రి ఎలక్ర్టిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్ (పీఎంఈ-డ్రైవ్) పథకం కింద, ఎలక్ర్టిక్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గ్రేటర్‌లో ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ పూర్తి చేసింది. 10 సర్కిళ్లలో, మూడు కేటగిరీలలో 3,489 ఈవీ స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాబోయే ఆరు నెలల్లో గ్రేటర్ వ్యాప్తంగా 2000 వరకు ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలని డిస్కం లక్ష్యంగా పెట్టుకుంది.
70 నుంచి 100 శాతం రాయితీ
కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ కారాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు కేటగిరి (ఎ) కింద కేంద్రం 100 శాతం రాయితీ అందిస్తోంది. బీ కేటగిరిలో జాతీయ రహదారులతో పాటు రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు, బస్‌స్టేషన్లు, మెట్రోస్టేషన్లు, టోల్‌ప్లాజాలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటికి 70-80 శాతం రాయితీ అందిస్తోంది. సీ కేటగిరిలో ప్రధాన వీధులు, షాపింగ్ మాల్స్ మార్కెట్ కాంప్లెక్స్‌ల వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటికి 80 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది









Comments