అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ కుమారులు
తిరుమల : తమ తండ్రి ఎన్టీ రామారావు వీరాభిమాని పాడెను ఆయన కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు. తిరుమలకు చెందిన ఎన్టీఆర్ రాజు భౌతికకాయాన్ని గురువారం ఉదయం సందర్శించి నివాళి అర్పించి.. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఆయన కుటుంబ సభ్యులతోనే గడిపారు. ఎన్టీ రామారావు అభిమానిగా, ఎన్టీఆర్ రాజుగా గుర్తింపు పొందిన తిరుమల స్థానికుడు బి.రామచంద్రరాజు బుధవారం తిరుపతిలో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు తిరుమలలో గురువారం జరిగాయి. ఎన్టీ రామారావు కుమారులు రామకృష్ణ, మోహనకృష్ణ ఉదయమే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని రాజుకు పుష్పాంజలి ఘటించి సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత హీరో చైతన్యకృష్ణ దంపతులు కూడా తిరుమలకు చేరుకుని ఎన్టీఆర్ రాజుకు నివాళులు సమర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎన్టీఆర్ రాజు నుదుటిపై ఎన్టీఆర్ ఫొటోతో కూడిన చిహ్నం అందరినీ ఆకర్షించింది. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఎన్టీఆర్ రాజుకు నివాళులు అర్పించారు.









Comments