ముస్తాక్ అలీ విజేత జార్ఖండ్
పుణె: ఇషాన్ కిషన్ (49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 101) దూకుడైన శతకంతోపాటు బౌలర్లు రాణించడంతో.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని జార్ఖండ్ తొలిసారి ముద్దాడింది. గురువారం జరిగిన ఫైనల్లో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో హరియాణాను చిత్తు చేసింది. తొలుత జార్ఖండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 262 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (81), అనుకూల్ రాయ్ (40 నాటౌట్) రాణించారు. కిషన్, కుశాగ్ర రెండో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. ఛేదనలో హరియాణా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. యశ్వర్ధన్ (53), సమంత్ (38), నిశాంత్ (31) చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించారు. సుశాంత్ మిశ్రా, బాలకృష్ణ చెరో 3 వికెట్లు తీశారు.









Comments