గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా మిలటరీ స్థావరాలు
గ్రీన్‌ల్యాండ్‌లో భారీగా అమెరికా స్థావరాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్‌లతో ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌లో భద్రత, ఇతర అవసరాల విషయంలో అమెరికాకు శాశ్వత నియంత్రణ లభించనుందని పేర్కొన్నారు. నిజానికి గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు అమ్మేయాలని.. లేకుంటే సైనిక చర్య జరిపి అయినా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఇటీవల పలుమార్లు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒప్పందంపై ట్రంప్ ప్రకటన ఆసక్తి రేపుతోంది. డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌ల్యాండ్‌లో స్థానికంగా స్వతంత్ర ప్రభుత్వం కొనసాగుతోంది. అమెరికాతో ఒప్పందంపై డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ సంతకాలు చేయనున్నాయి. వచ్చేవారం ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా సంతకాల ప్రక్రియ జరగనున్నట్టు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్ తెలిపారు. ఇక ఈ ఒప్పందం మూడు ప్రభుత్వాలకు ప్రయోజనకరమని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని నీల్సన్ పేర్కొన్నారు.










Comments