• Jun 25, 2026
  • NPN Log

    ముంబై : ముంబై సబర్బన్‌ రైల్లో ప్రయాణికుల మధ్య జరిగిన చిన్న వివాదం ఒక యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. కదిలే రైల్లో డోర్‌ మూసే విషయంలో మయాంక్‌ లోహర్‌ (21) అనే యువకుడికి, రోషన్‌ అనే వ్యక్తికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో రోషన్‌పై తోటి ప్రయాణికులు చేయి చేసుకున్నారు. దీంతో విచక్షణ కోల్పోయిన రోషన్‌ తన బ్యాగులోంచి కత్తి తీసి మయాంక్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో మయాంక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హత్య ఘటన తాలూకు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నిందితుడు రక్తసిక్తమైన కత్తిని పట్టుకొని వీడియోలో ఉండటం కనిపించింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో నిందితుడు రోషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement