తిరుమలలో రాజకీయ బ్యానర్లపై TTD స్పందన
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం రేపిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫొటోలతో ఉన్న బ్యానర్ ప్రదర్శించడంపై TTD స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్‌ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించామని పేర్కొంది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.










Comments