నేటి నుంచి స్కూళ్లకు టెన్త్ ఒరిజనల్ మార్కు మెమోలు
హైదరాబాద్ : పదో తరగతి వార్షిక పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై, ఉత్తీర్ణులైన విద్యార్థుల ఒరిజనల్ మార్కుల మెమోలను శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పంపించనున్నారు. విద్యార్థులు తమ ఒరిజనల్ ఎస్‌ఎస్‌సీ మెమోలను నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.










Comments